'సుబ్రహ్మణ్యపురం' ఫేం సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో యువ హీరో నాగశౌర్య 20వ చిత్రం చేస్తున్నాడు. ఇప్పటివరకు ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను నవంబర్ 30(సోమవారం) సాయంత్రం 5.04గంటలకు ప్రకటించనున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని నాగశౌర్య లుక్ ఆసక్తిని కలిగిస్తోంది.
విలువిద్యకారునిగా
ఎప్పుడూ లవర్‌బాయ్‌లా కనిపించే నాగశౌర్య.. ఈ చిత్రంలో కండలవీరుడుగా దర్శనమివ్వనున్నాడు. ఆర్చరీ క్రీడాకారుడుగా కనిపించనున్నాడు. సినిమా కోసం జుట్టు, గడ్డం కూడా బాగా పెంచాడు. ఎనిమిది పలకల దేహాన్ని కూడా తయారు చేశాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.
ఇదీ చూడండి : ఆర్చరీ క్రీడాకారుడుగా నాగశౌర్య ఫస్ట్‌లుక్ ఇదే!