'కింగ్' నాగార్జున ప్రధానపాత్రలో విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రాజన్న'. 2011లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. తెలంగాణ ప్రాంత విప్లవ వీరుడి పాత్రలో నాగ్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా తమిళ డబ్బింగ్ వెర్షన్‌కు దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మోక్షం కలిగింది.
తొమిదేళ్ల తర్వాత నాగ్ సినిమాకు మోక్షం! - రాజన్న సినిమా వార్తలు
నాగార్జున 'రాజన్న' డబ్ వెర్షన్ తొమ్మిదేళ్ల తర్వాత విడుదల కానుంది. ఈ విషయాన్ని సదరు నిర్మాత వెల్లడించడం సహా పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
తొమిదేళ్ల తర్వాత తమిళంలో విడుదలవుతున్న చిత్రం
'రాజాసింగమ్' అనే పేరుతో రానున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. లక్ష్మీ లోటస్ మూవీ మేకర్స్ నిర్మాత ఎస్జీఆర్ ప్రసాద్.. 'రాజన్న' తమిళ హక్కులను సొంతం చేసుకున్నారు.
ఇదీ చూడండి:మిస్టరీ డ్రామాలో పోలీసు అధికారిగా పాయల్