కింగ్ నాగార్జున ఎన్ఐఏ అధికారి విజయ్ వర్మగా నటించిన చిత్రం 'వైల్డ్ డాగ్'. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తిచేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ అందుకుంది. హైదరాబాద్‌లో జరిగిన పేలుళ్ల(గోకుల్ చాట్-2007, దిల్సుఖ్నగర్-2013) నేపథ్యంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఏప్రిల్ 2న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.
'వైల్డ్‌డాగ్' సెన్సార్ పూర్తి.. తమన్నా వెబ్‌సిరీస్ టీజర్ - వైల్డ్ డాగ్ సెన్సార్ పూర్తి నాగార్జున
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన 'వైల్డ్ డాగ్' సినిమా సెన్సార్‌ను పూర్తిచేసుకుని యూ/ఏ సర్టిఫికేట్ అందుకుంది. తమన్నా నటిస్తున్న '11th అవర్' వెబ్‌సిరీస్ టీజర్ విడుదలైంది.
వైల్డ్‌డాగ్
అగ్ర కథానాయిక తమన్నా కీలక పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ '11th అవర్'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. సోమావారం ఈ సినిమా టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 9వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.
ఇదీ చూడండి: జీవితంలో అలా ఉండాలనుకుంటున్నా: నాగార్జున