తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వైల్డ్​డాగ్​' లీక్.. యూట్యూబ్​లో మొత్తం సినిమా! - movie news

'వైల్డ్ డాగ్' సినిమా మొత్తం లీకైంది. అరే అవునా ఇంతకీ ఏమైంది? యూట్యూబ్​లో ఎందుకు కనిపిస్తోంది? అని అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చదివేయండి.

NAGARJUNA WILD DOG MOVIE LEAKED
'వైల్డ్​డాగ్​' లీక్.. యూట్యూబ్​లో మొత్తం సినిమా!

By

Published : Apr 1, 2021, 8:29 PM IST

Updated : Apr 1, 2021, 8:43 PM IST

కింగ్ నాగార్జున 'వైల్డ్​డాగ్' యూట్యూబ్​లో పెట్టేశారు! అవును మీరు విన్నది నిజమే. రిలీజ్​కు రోజు​ ఉందనగా సినిమాను నెట్​లో అప్​లోడ్ చేశారు? ఎవరు.. ఎప్పుడు.. ఎలా? అనే సందేహం మీకు వచ్చిందా? అయితే దీనిని చదివేయండి.

'వైల్డ్​డాగ్​' సినిమాలో నాగార్జున

ఓ వైపు 'వైల్డ్​డాగ్' ప్రచారంలో చిత్రబృందం బిజీగా ఉంది. ఈ క్రమంలోనే సినిమాను లీక్​ అయిందంటూ వార్తలు వచ్చాయి. దీంతో పైరసీని అరికట్టడంలో భాగంగా, నిర్మాతలు వినూత్న ప్రయత్నం చేశారు. పైరసీని అడ్డుకోండి, థియేటర్లలోనే సినిమా చూడండి అని నటులు అలీరెజా, సయామీ ఖేర్​తో చెప్పింది అనే సన్నివేశంతో పాటు 'హ్యాపీ ఏప్రిల్ ఫూల్స్ డే', 'వైల్డ్​డాగ్ రేపు థియేటర్లలో విడుదల' అని ఉన్న దాదాపు 2 గంటల 9 నిమిషాల వీడియోను నిర్మాతలు యూట్యూబ్​లో అప్​లోడ్ చేశారు. దీంతో షాక్​ అయిన నెటిజన్లు.. వీడియో చూసి నవ్వుకుంటున్నారు.

గోకుల్​ చాట్, దిలుసుఖ్​నగర్​లో గతంలో జరిగిన పేలుళ్ల నేపథ్య కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. అహిసోర్ సల్మాన్​ దర్శకుడు. మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్​ నిర్మించింది.

Last Updated : Apr 1, 2021, 8:43 PM IST

ABOUT THE AUTHOR

...view details