*నాగార్జున-కాజల్ జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ బుధవారం తిరిగి ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సెట్‌కు సంబంధించిన ఓ ఫొటోను దర్శకుడు ప్రవీణ్ సత్తారు పోస్ట్ చేశారు. ఇందులో నాగార్జున కెమెరాను చూస్తూ కనిపించారు. లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకొంటోంది.
*హాస్య నటుడు సత్య హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'వివాహ భోజనంబు'. అర్జావీ రాజ్ హీరోయిన్. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. యువ నటుడు సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించారు. త్వరలోనే కొత్త ఓటీటీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదలైంది. లాక్‌డౌన్ ఇతివృత్తంగా సాగే సన్నివేశాలతో ఆద్యంతం నవ్విస్తోంది.