తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దుబాయ్​లో నాగార్జున ఫైటింగ్! - Nagarjuna samantha divorce

Nagarjuna movies: 'బంగార్రాజు'తో సంక్రాంతికి సందడి చేసిన కింగ్ నాగార్జున.. ఇప్పుడు 'ది ఘోస్ట్' సినిమా కోసం పోరాటాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగానే త్వరలో దుబాయ్ వెళ్లనున్నారు.

nagarjuna
నాగార్జున

By

Published : Jan 29, 2022, 7:06 AM IST

Nagarjuna The Ghost movie: ప్రతిసారీ ఓ కొత్త రకమైన కథతో సినిమా చేసే దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు. ఆయన యాక్షన్‌ ప్రధానమైన కథ చేస్తే ఎలా ఉంటుందో 'గరుడవేగ'తో రుజువైంది. మరోసారి యాక్షన్‌ నేపథ్యంలోనే సాగే కథతో 'ది ఘోస్ట్‌' చేస్తున్నారు. నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం దుబాయ్‌ వెళ్లబోతోంది చిత్రబృందం. వచ్చే నెల 3వ తేదీ నుంచి అక్కడ పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తారు.

థాయ్‌లాండ్‌కు చెందిన ప్రముఖ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ నుంగ్‌, అతని బృందం నేతృత్వంలో పోరాట ఘట్టాల్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో నాగ్‌తోపాటు నాయిక సోనాల్‌ చౌహాన్‌ పాల్గొననున్నారు. మొదట ఈ సినిమాలో నాగ్‌కి జోడీగా కాజల్‌ అగర్వాల్‌ను ఎంపిక చేశారు.

'ది ఘోస్ట్' సినిమా

పెళ్లి తర్వాత ఆమెకు ప్రెగ్నెన్సీ రావడం వల్ల, కాజల్‌ స్థానంలో మరో నాయిక కోసం అన్వేషణ మొదలు పెట్టింది చిత్రబృందం. అమలాపాల్‌, మెహ్రీన్‌తోపాటు పలువురు తారల పేర్లు వినిపించాయి. ఇటీవలే చిత్రబృందం సోనాల్‌ను ఖాయం చేసింది. ఈ చిత్రాన్ని నారాయణ్‌దాస్‌ కె.నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు, శరత్‌ మరార్‌ కలిసి నిర్మిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details