తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సమంత గురించి నాగార్జున ఎమోషనల్ పోస్ట్ - సమంత గురించి నాగార్జున ఎమోషనల్ పోస్ట్

చైతూ-సమంత విడాకులపై (Chaysam Divorce) అక్కినేని నాగార్జున స్పందించారు. ఇరువురు విడిపోవడం దురదృష్టకరమని అన్నారు. దీనిపై మాట్లాడడం ఎంతో బాధగా ఉందన్నారు.

Chaysam Divorce
నాగార్జున

By

Published : Oct 2, 2021, 6:33 PM IST

Updated : Oct 2, 2021, 6:44 PM IST

నాగచైతన్య, సమంత తమ వివాహ బంధానికి ముగింపు (Chaysam Divorce) పలకడం పూర్తిగా వాళ్ల వ్యక్తిగత నిర్ణయమని అక్కినేని నాగార్జున స్పష్టం చేశారు. చైతూ-సామ్ విడాకులపై స్పందించిన నాగార్జున వాళ్లు విడిపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. విడాకుల విషయంపై స్పందించడానికి తన హృదయం ఎంతో భారంగా ఉందని ట్వీట్ చేశారు.

"ఎంతో బరువైన హృదయంతో ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోంది. సామ్‌-చై విడిపోవటం నిజంగా దురదృష్టకరం. భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల వ్యక్తిగతం. సమంత, నాగచైతన్య ఇద్దరూ నాకెంతో దగ్గరి వారు. సమంతతో నా కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైంది. ఆమె మా కుటుంబానికి చాలా దగ్గరైంది. దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి."

-ట్విటర్‌లో నాగార్జున

ఇదీ చూడండి:నాగచైతన్య, సమంత.. వీరి ప్రేమకథ మాయ చేసింది!

Last Updated : Oct 2, 2021, 6:44 PM IST

ABOUT THE AUTHOR

...view details