తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నిన్నే పెళ్లాడతా' లోగో ఆవిష్కరించిన కింగ్ నాగార్జున - nagarjuna

రకుల్​ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా పరిచయమవుతోన్న సినిమాకు 'నిన్నే పెళ్లాడతా' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ టైటిల్ లోగోను టాలీవుడ్  హీరో అక్కినేని నాగార్జున ఆవిష్కరించాడు.

నిన్నేపెళ్లాడత

By

Published : Jul 19, 2019, 12:27 PM IST

గతంలో కింగ్ నాగార్జున, టబు నటించిన 'నిన్నే పెళ్లాడతా' ఘనవిజయం సాధించింది. ఇప్పుడు అదే టైటిల్‌తో రకుల్​ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబికా ఆర్ట్స్, ఈశ్వరి ఆర్ట్స్ పతాకాలపై బొల్లినేని రాజశేఖర్ చౌదరి, వెలుగోడు శ్రీధర్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వైకుంఠ బోను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ లోగో‌ను అక్కినేని నాగార్జున గురువారం హైదరాబాద్‌లో ఆవిష్కరించాడు.

నిన్నే పెళ్లాడత పోస్టర్

అమన్, సిద్ధిక హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో సాయికుమార్, సీత, ఇంద్రజ, సిజ్జు, అన్నపూర్ణమ్మ, మధునందన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తయింది. ఆగస్టు 2 నుంచి వైజాగ్‌లో చివరి షెడ్యూల్ ప్రారంభమవుతుంది. అక్టోబర్‌లో సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'నిన్నే పెళ్లాడతా' ఫస్ట్ లుక్‌ని కింగ్ నాగార్జున ఆవిష్కరించినందుకు సంతోషంగా ఉందన్నారు. కొత్తవారిమైనా మమ్మల్ని పెద్దమనసుతో ఆశీర్వదించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు.

ఇవీ చూడండి.. డార్లింగ్​ ప్రభాస్​ 'సాహో' విడుదల తేదీ ఇదే..

ABOUT THE AUTHOR

...view details