హిందీలో విజయవంతమైన 'రైడ్'ను తెలుగులో రీమేక్ చేయడంపై ప్రముఖ కథానాయకుడు నాగార్జున ఎప్పట్నుంచో ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ సినిమా గురించి ఆయన పలువురు దర్శకులతో చర్చించారు. మరి ఆ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతని ఎవరికి అప్పచెబుతారనేది ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది.
నాగార్జున 'వైల్డ్ డాగ్' చిత్రంలో నటిస్తున్నారు. చిత్రీకరణ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో తదుపరి చేయాల్సిన చిత్రాలపై నాగ్ దృష్టి సారించారు.