బిగ్‌బాస్ హౌస్‌లో(bigg boss telugu sunny) కెప్టెన్సీ పోటీదారుల ఎంపికలో భాగంగా జరుగుతున్న 'నీ ఇల్లు బంగారం కాను' టాస్క్ ఉత్కంఠగా కొనసాగుతోంది(bigg boss 5 captaincy task). టాస్క్‌లో భాగంగా పవర్ రూమ్‌లోకి వెళ్లే అవకాశాన్ని దక్కించుకునేందుకు ఇంటి సభ్యులందరూ ఎదురుచూశారు. ఈ క్రమంలోనే పవర్‌రూమ్‌లోకి వెళ్లే అవకాశాన్ని సొంతం చేసుకుని స్పెషల్ పవర్‌ను రవి దక్కించుకున్నారు(bigg boss anchor ravi). "ఈ స్పెషల్ పవర్‌ను మీరు ఉపయోగించుకుంటారా? లేదా ఇంటి సభ్యుల్లో ఎవరికైనా ఇస్తారా?" అని రవిని బిగ్‌బాస్ ప్రశ్నించగా.. సన్నీకి తాను ఈ స్పెషల్ పవర్ ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు.
nagarjuna bigg boss 5: రవికి సూపర్‌పవర్.. సన్నీ అసహనం - బిగ్‌బాస్ రవి సూపర్ పవర్
బిగ్‌బాస్ హౌస్‌లో(nagarjuna bigboss 5) కెప్టెన్సీ పోటీదారుల ఎంపికలో భాగంగా జరుగుతున్న 'నీ ఇల్లు బంగారం కాను' టాస్క్ ఉత్కంఠంగా కొనసాగుతోంది. టాస్క్‌లో భాగంగా పవర్రూమ్లో వెళ్లే అవకాశాన్ని అందుకొని స్పెషల్ పవర్‌ను దక్కించున్న రవి(bigg boss anchor ravi).. ఆ పవర్‌ను సన్నికి ఇచ్చాడు(bigg boss telugu sunny). అయితే దీనిపై సన్నీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమోను చూసేయండి..
![nagarjuna bigg boss 5: రవికి సూపర్‌పవర్.. సన్నీ అసహనం bigboss](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13668820-thumbnail-3x2-bigboss.jpg)
పవర్ రూమ్ నుంచి బయటకు వచ్చిన అనంతరం తన వద్ద ఉన్న స్పెషల్ పవర్‌ను సన్నీకి(bigg boss telugu sunny) ఇస్తున్నట్లు రవి చెప్పగానే.. ఇంటి సభ్యులందరూ ఒకింత ఆశ్చర్యపోయారు. ఇక, సన్నీ అయితే అసహనానికిలోనయ్యాడు. "నాకు ఏ స్పెషల్ పవర్ వద్దు. నేను దాన్ని తీసుకోను" అని తేల్చి చెప్పేశాడు. "నువ్వు తీసుకోను అనడానికి లేదు. అది రూల్.. తీసుకుని తీరాలి" అని రవి చెప్పగానే.. మారుమాట్లాడకుండా సన్నీ దాన్ని తీసుకున్నాడు. అనంతరం స్విమ్మింగ్ పూల్ వద్ద ఒక్కడే కూర్చొని.. "బిగ్‌బాస్ సర్.. అందరూ నన్ను రెచ్చగొట్టి పంపిస్తారు. చివరికి నన్ను వెర్రి వాడిని చేస్తారు" అంటూ సన్నీ తనలో తానే మాట్లాడుకున్నాడు. ఇంతకీ రవికి వచ్చిన స్పెషల్ పవర్ ఏమిటి? దాని వల్ల సన్నీకి ఏదైనా ఉపయోగం ఉంటుందా?ఉండదా?తెలుసుకోవాలంటే ఈరోజు ప్రసారం కానున్న బిగ్‌బాస్ ఎపిసోడ్ చూడాల్సిందే..(bigg boss telugu latest promo)!
ఇదీ చూడండి: 'నువ్వు నన్ను ఏం చేయలేవు'.. సిరి, షణ్ముఖ్ మాటల యుద్ధం!