బిగ్‌బాస్ హౌస్‌లో సండే సందడి షురూ అయ్యింది. ఎలిమినేషన్(bigg boss telugu elimination today) విషయాన్ని మర్చిపోయి మరీ.. ఇంటిసభ్యులందరూ సరదా ఆటల్లో మునిగిపోయారు. ఇంటిసభ్యుల్లో కొందరు తమ తోటి కంటెస్టెంట్‌ల నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే వారు రాసిన ప్రశ్నలను స్టేజ్‌పై ఉన్న నాగ్(bigg boss show telugu nagarjuna) చదివి.. సమాధాలు అడిగి తెలుసుకున్నారు.
bigboss5: ప్రియాంకతో రిలేషన్‌షిప్.. మానస్ ఏం చెప్పాడంటే? - bigg boss elimination telugu this week
బిగ్‌బాస్ హౌస్‌లో(bigg boss show telugu nagarjuna) ఇంటిసభ్యులందరూ సరదా ఆటల్లో మునిగిపోయి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ రిలేషన్‌షిప్ గురించి మాట్లాడారు మానస్, ప్రియాంక. కాగా, ఇలా ఎంతో సరదాగా సాగుతున్న బిగ్‌బాస్ హౌస్ నుంచి నేడు ఎవరు ఎలిమినేట్(bigg boss elimination telugu this week) కానున్నారో తెలియాలంటే కొన్ని గంటల్లో ప్రసారం కానున్న ఎపిసోడ్ చూడాల్సిందే.అప్పటివరకు ప్రోమోను చూసేయండి..

ఇందులో భాగంగా మానస్‌ను(bigg boss manas).. "భవిష్యత్తులో ప్రియాంకతో నీ రిలేషన్‌షిప్ ఎలా ఉండనుంది" అని మిగిలిన ఇంటిసభ్యులు తెలుసుకోవాలనుకుంటున్నారు అని నాగ్ అడగ్గా.. "స్నేహితులుగానే ఉంటాం" అని సమాధానమిచ్చాడు. అనంతరం ప్రియాంకను(bigg boss priyanka).. "నువ్వు మానస్ నుంచి ఏం కోరుకుంటున్నావ్" అని అడగ్గా.. "సర్.. నన్ను ఈ ప్రశ్న అడగమని ఎవరు చెప్పారో చెప్పండి" అని ఆమె కోరగా.. 'మానస్' అంటూ నాగ్ నవ్వులు పూయించారు. ఇలా ఎంతో సరదాగా సాగుతున్న బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కానున్నారో తెలియాలంటే ఈ రోజు ప్రసారం కానున్న ఎపిసోడ్ చూడాల్సిందే.
ఇదీ చూడండి:Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌ను వెళ్లిపోమన్న నాగ్.. సిరిపై ఫైర్!