Vijaysethupati Samantha nayantara movie: విజయ్ సేతుపతి, సమంత, నయనతారలు ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'కాతువాకుల రెండు కాదల్'. ఈ సినిమాను థియేటర్లలో ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఇక ఈ మూవీలో క్రికెటర్ శ్రీశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. విఘ్నేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీత సమకూరుస్తున్నాడు.
'గని' సెన్సార్ పూర్తి
Varuntej Gani movie: మెగాహీరో వరుణ్‌తేజ్ 'గని' సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికేట్‌ను దక్కించుకుంది. ఇందులో వరుణ్ బాక్సర్‌గా కనిపించారు. సయీ మంజ్రేకర్ కథానాయిక. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పకులు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపింది చిత్రబృందం. జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్‌చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతమందించారు.
ఓటీటీలోకి బంగార్రాజు ఎంట్రీ..
Nagarjuna Bangarraju movie: నాగార్జున, నాగచైతన్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'బంగార్రాజు'. కల్యాన్కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఈనెల 18 నుంచి జీ5 తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను విడుదల చేసింది సదరు ఓటీటీ సంస్థ. తెలిపింది. 'సోగ్గాడే చిన్ని నాయనా'కు సీక్వేల్‌గా వచ్చిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతిశెట్టి, రావురమేశ్ తదితరులు నటించారు.
'సీతా కళ్యాణ వైభోగమే'
సుమన్ గరీమ చౌహాన్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం 'సీతా కళ్యాణ వైభోగమే'. సతీష్ పరమవేద దర్శకత్వంలో డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైది. ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. నాంది దర్శకుడు విజయ్ కనకమేడల, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇదీ చూడండి: 1484 రోజుల తర్వాత రణ్‌బీర్.. రిలీజ్ డేట్‌తో వైష్ణవ్ తేజ్