కథానాయకుడు నాగార్జున దృష్టంతా ఇప్పుడు 'బంగార్రాజు' పైనే ఉంది. లాక్‌డౌన్‌తో దొరికిన ఈ సమయాన్ని పూర్తిగా ఆ సినిమా కోసమే కేటాయిస్తున్నారు. కథా చర్చల్లో పాల్గొంటూ స్క్రిప్టును పక్కా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోపక్క సంగీత చర్చలు సాగుతున్నట్టు తెలిసింది. ఈ సినిమా ప్రస్తావన ఎప్పుడొచ్చినా సరే... పండగ సినిమా అంటుంటారు నాగ్. అంటే వచ్చే సంక్రాంతి లక్ష్యంగానే 'బంగార్రాజు' సినిమాను చేస్తారని తెలుస్తోంది. అందుకే నాగ్ ఆ సినిమాపై ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.
నాగ్ దృష్టంతా 'బంగార్రాజు' పైనే - నాగార్జున
హీరో నాగార్జున.. లాక్డౌన్ సమయాన్ని పూర్తిగా 'బంగార్రాజు' సినిమా కోసమే కేటాయిస్తున్నారని తెలిసింది. కథా చర్చల్లో పాల్గొంటూ స్క్రిప్టును పక్కా చేసే ప్రయత్నాల్లో ఉంటున్నారట. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకొస్తారని సమాచారం.
నాగ్
విజయవంతమైన 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాకు ప్రీసీక్వెల్గా రూపొందనున్న చిత్రమే 'బంగార్రాజు'. ఇలాంటి మాస్ అంశాలతో కూడిన సినిమాను నాగార్జున చేసి చాలా కాలమైంది. ఇందులో నాగార్జునతోపాటు ఆయన వారసుల్లో ఎవరో ఒకరు కనిపించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇందులో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కనిపించనుందని సమాచారం. ఆ వివరాలన్నీ బయటికి రావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
ఇదీ చూడండి: నాగార్జున 'బంగార్రాజు'లో సోనాక్షి సిన్హా!