తెలంగాణ

telangana

By

Published : Sep 28, 2021, 10:24 PM IST

Updated : Sep 29, 2021, 9:17 AM IST

ETV Bharat / sitara

మా ప్రయాణం ఆగిపోతుందనే బాధ కలిగింది: నాగచైతన్య

సినీ పరిశ్రమపై(akkineni nagarjuna love story) తీవ్ర చర్చ జరుగుతున్న వేళ.. చిత్రసీమను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పుడూ చల్లగానే చూశాయని అన్నారు హీరో నాగార్జున(love story success meet). 'లవ్​స్టోరి' డైరెక్టర్ శేఖర్​ కమ్ములతో తనకు ఏర్పడిన అనుబంధాన్ని హీరో నాగచైతన్య చెప్పారు.

lovestory
లవ్​స్టోరీ

ప్రస్తుతం సినీ పరిశ్రమపై(akkineni nagarjuna love story) తీవ్ర చర్చ జరుగుతున్న వేళ.. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. చిత్రసీమకు ప్రభుత్వాల మద్దతు ఎల్లప్పుడూ ఉందని, పరిశ్రమను చల్లగా చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాల మద్దతు అలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు. తెలుగు ప్రేక్షకులకు సినిమాలంటే ఇష్టమని, వారి ఆశీర్వదం ఎల్లప్పుడూ ఉండాలని ​ కోరారు. తన తనయుడు నాగచైతన్య నటించిన 'లవ్​స్టోరీ'(love story success meet) చిత్రం విజయం సాధించడం వల్ల ఆ చిత్ర బృందం విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాగ్​... ఈ వ్యాఖ్యలు చేశారు.

నాగార్జున

కరోనా సమయంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంతో శ్రమించి ప్రజలను రక్షించాయని కొనియాడారు నాగార్జున(love story movie success). వైఎస్ జగన్, కేసీఆర్ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే కరోనా ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో తగ్గిందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అన్న నాగ్​.. తెలంగాణలో థియేటర్లు తెరవడం అదృష్టమన్నారు. ఏపీలో పరిస్థితులను బట్టి 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు తెరిచారని తెలిపారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నాగ చైతన్య

కొత్తదారి చూపింది

లవ్​స్టోరీ(lovestory success meet) గురించి నాగార్జున మాట్లాడుతూ.. కరోనా పరిస్థితుల్లో ఈ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల షేర్ సాధించిందని అన్నారు. సినిమాను ఇంతలా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమకు మరోసారి కొత్తదారి చూపించదన్న నాగ్​(lovestory trailer).. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే నమ్మకాన్ని నిలిచిందన్నారు. ఈ మూవీ చూసి ఒక్క అమ్మాయి అయినా తన జీవితంలో జరిగిన సంఘటన చెప్పగలిగితే అదే విజయమన్నారు.

సాయి పల్లవి

'నా ప్రతి సినిమా విడుదలైన తొలిరోజు ప్రేక్షకుల స్పందన ఏంటి? క్రిటిక్స్‌ ఏమంటున్నారు?అని తెలుసుకుంటా. వాటినిబట్టి ముందుకెళ్తుంటా. కొవిడ్‌ కారణంగా కొన్నాళ్లు దీనికి దూరమయ్యా. ఈ నెల 24న ‘లవ్‌స్టోరి’ విడుదల కావడం వల్ల ఎంతో ఆనందించాను. థియేటర్‌కు వచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ చాలా థ్యాంక్స్‌. దర్శకుడు శేఖర్‌ కమ్ముల నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. సినిమా విడుదలతో మా ప్రయాణం ఆగిపోతుందనే బాధ కలిగింది. ఈ జర్నీని ఆపొద్దు సర్‌!’ అని నాగచైతన్య, శేఖర్‌ కమ్ములని కోరారు.

ఇదీ చూడండి:

'అది నా వ్యక్తిగతం.. సినిమాతో ముడిపెట్టొద్దు'

Sai Pallavi: 'రీమేక్‌ అని నో చెప్పలేదు.. ఆ భయంతోనే చెప్పా'

'సాయి పల్లవితో చేసేందుకు చాలా టేక్​లు తీసుకున్నా'

Last Updated : Sep 29, 2021, 9:17 AM IST

ABOUT THE AUTHOR

...view details