Samantha divorce: సెలబ్రిటీ కపుల్ నాగచైతన్య-సమంత వైవాహిక బంధానికి స్వస్తి పలికి సుమారు మూడు నెలలు అవుతున్నా వారిద్దరి గురించి ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. దీంతో వాళ్లిద్దరూ విడిపోవడానికి కారణాలు ఇవేనంటూ పలు వార్తలు, వీడియోలు నెట్టింట్లో తెగ పుట్టుకొస్తున్నాయి. అందులో భాగంగానే వివాహమానంతరం సమంత బోల్డ్ పాత్రలు చేయడం చైతన్య, నాగార్జునకు నచ్చలేదని.. ఆ విషయంలో అక్కినేని కుటుంబంతో సామ్‌కు గొడవలు జరిగాయని, అక్కినేని కుటుంబం సామ్‌కు ఎన్నో షరతులు పెట్టిందని.. ఇలా ఎన్నో వార్తలు దర్శనమిచ్చాయి.
Samantha naga chaitanya divorce: సామ్-చై విడిపోతున్నట్లు ప్రకటించిన నాటి నుంచి వచ్చిన పలు వార్తలపై నటుడు నాగార్జున ఇప్పుడు స్పందించారు. ప్రస్తుతం 'బంగార్రాజు' సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆయన ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా చై-సామ్ విడిపోవడంపై తమ కుటుంబం గురించి వస్తున్న వార్తలపై స్పందించారు.