తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలే సామ్​కు ఇష్టం' - సమంత సినీ గ్యాప్​పై చైతన్య క్లారిటీ

వరుస సినిమాలతో అలరించిన హీరోయిన్​ సమంత.. ప్రస్తుతం వాటికి విరామం తీసుకుంది. ఈ విషయంపై స్పష్టతనిచ్చాడు ఆమె భర్త, హీరో నాగ చైతన్య.

నాగచైతన్య , సమంత

By

Published : Sep 9, 2019, 10:15 AM IST

Updated : Sep 29, 2019, 11:14 PM IST

హీరోయిన్​ సమంత.. కొత్త సినిమాలు అంగీకరించకపోవటానికి కారణం అవకాశాలు తగ్గడమేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వదంతులన్నీ నిజం కాదంటున్నాడు ఆమె భర్త, హీరో నాగచైతన్య. తక్కువ చిత్రాలే చేసినా, గుర్తుండిపోయే పాత్రల్లో నటించటమే సామ్​కు ఇష్టమని చెబుతున్నాడు.

"పెళ్లి తర్వాత సమంతకు అవకాశాలు తగ్గాయన్నది నిజం కాదు. గత రెండేళ్లలో కెరీర్​లోనే అత్యుత్తమ చిత్రాల్లో కనిపించింది. నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకునే పాత్రల్లో కనిపించడమే సామ్​కు ఇష్టం. సరైన కథ కనిపిస్తే నటిస్తుంది. ఎక్కువ సినిమాలు తన ఖాతాలో వేసుకోవాలనే ఆలోచన లేదు. ప్రస్తుతం ఓ వెబ్​ సిరీస్​లో కీలక పాత్ర పోషిస్తోంది." -నాగచైతన్య, నటుడు

గతేడాది 'రంగస్థలం', 'మహానటి', 'అభిమన్యుడు', 'యూటర్న్'​లతో అలరించిన సమంత​... ఈ ఏడాది అదే జోరును కొనసాగించింది. భర్త నాగచైతన్యతో తొలిసారి కలిసి నటించిన 'మజిలీ', 'ఓ బేబీ'లతో హిట్​లు అందుకుంది.

ఇదీ చూడండి: 'ఆయనతో నటించడం అంత తేలిక కాదు'

Last Updated : Sep 29, 2019, 11:14 PM IST

ABOUT THE AUTHOR

...view details