తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బదాయీ హో' తెలుగు రీమేక్​లో చైతూ..? - badhai ho

బాలీవుడ్​లో ఘనవిజయం సాధించిన బదాయీ హో సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు దిల్ రాజు - బోనీ కపూర్. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటించనున్నట్లు సమాచారం. 2018లో వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

నాగచైతన్య

By

Published : Sep 12, 2019, 5:13 AM IST

Updated : Sep 30, 2019, 7:21 AM IST

టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు.. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కలిసి తెలుగులో ఘనవిజయం సాధించిన ఎఫ్2 సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా గత ఏడాది హిందీలో సక్సెస్​ అయిన బదాయీ హో చిత్రాన్ని టాలీవుడ్​ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో నాగచైతన్య హీరోగా నటించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం వెంకీ మామ చిత్రంతో బిజీగా ఉన్నాడు చైతూ. తాజాగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక బదాయీ హో రీమేక్​లో నటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

బదాయీ హో సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించాడు.

ఇదీ చదవండి: ప్రతిరోజూ పండగే అంటున్న సాయిధరమ్ తేజ్

Last Updated : Sep 30, 2019, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details