అక్కినేని నాగచైతన్య-సమంత జంట వైవాహిక బంధానికి తెరపడింది. తాము ఇద్దరం విడిపోతున్నట్లు పరస్పరం అధికారికంగా ప్రకటించారు. ఎంతో చర్చించి ఆలోచించుకున్నాకే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు సామాజిక మాద్యమాల వేదికగా ఇరువురు వెల్లడించారు. 2017లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం గోవాలో ఒక్కటైన ఈ జంట.. 'ఏం మాయ చేశావే', 'ఆటోనగర్ సూర్య', 'మనం', 'మజిలి' చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. టాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా పేరున్న చైతన్య సమంత జంట విడిపోవడం అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలుగు చలన చిత్రపరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని నాగచైతన్య, సమంతలు తమ బంధానికి ముగింపు పలికారు. భార్యభర్తలుగా విడిపోతున్నట్లు సామాజిక మాద్యమాల ద్వారా అధికారికంగా ప్రకటించారు. పదేళ్లుగా తమ స్నేహం కొనసాగినందుకు అదృష్టవంతులమని పేర్కొన్న చైతన్య, సమంత.. ఆ స్నేహమే తమ వివాహ బంధానికి కీలకంగా నిలిచిందన్నారు. అయితే విడిపోడానికి సరైన కారణాన్ని వెల్లడించని వీరిద్దరూ.. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తమ వ్యక్తిగత స్వేచ్ఛకు అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‌లో తమ స్నేహ బంధం కొనసాగుతుందని తెలిపారు.
2010లో గౌతమ్ మేనన్ దర్శకత్వంలో వచ్చిన 'ఏం మాయ చేశావే' చిత్రంతో మొదలైన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. 2017లో అక్టోబర్ 6, 7 తేదీల్లో గోవాలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలు ఎంతో వైభవంగా పెళ్లి జరిపించారు. పెళ్లికి ముందు ఆటో నగర్ సూర్య, మనం చిత్రాల్లో కలిసిన నటించిన సామ్ -చైతన్య.. పెళ్లి తర్వాత మజిలి చిత్రంలో భార్యభర్తలుగా నటించారు. ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకొని నిజమైన భార్యభర్తల అనుబంధానికి అద్దం పట్టింది. 2020 వరకు ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి వివాహ బంధం లాక్ డౌన్ కు ముందు అనూహ్య మలుపు తిరిగింది.
అక్కడే మొదలైంది!