తన అల్లుడు చైతన్యను నటుడు నాగబాబు సర్‌ప్రైజ్ చేశారు. ఓ ఖరీదైన కారును బహుమతిగా అందించారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'మా అల్లుడు చైతన్యకు ఇప్పటివరకూ ఎలాంటి బహుమతులివ్వలేదు. ఏదైనా ప్రత్యేకంగా ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇటీవల ఉగాదికి ఓ బహుమతి ఇద్దామనుకున్నాను.. కుదరలేదు. ఇప్పుడు అతడి కోసం ఓ రేంజ్‌రోవర్ డిస్కవరీ తీసుకున్నాం' అని నాగబాబు తెలిపారు. నిహారిక-చైతన్య దంపతులను నాగబాబు దంపతులు కలిసి.. ఆ కారును బహూకరించారు.
కొత్త అల్లుడికి నాగబాబు సర్‌ప్రైజ్ గిఫ్ట్ - నాగబాబు న్యూస్
మెగా అల్లుడు చైతన్యకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు నాగబాబు. ఆ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్లో పంచుకున్నారు.
కొత్త అల్లుడికి నాగబాబు సర్‌ప్రైజ్ గిఫ్ట్
నాగబాబు కుమార్తె నిహారికకు గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో వివాహం జరిగింది. గతేడాది డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌విలాస్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. మెగా కుటుంబసభ్యులు, బంధువులు, సినీ పరిశ్రమకు చెందిన అతి తక్కువమంది ప్రముఖులు ఈ వివాహ వేడుకలో సందడి చేశారు.