తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ప్రకాశ్​రాజ్​ను పోల్చాల్సింది విష్ణుతో కాదు' - nagababu support to prakash raj

'మా' ఎన్నికల్లో(maa elections 2021) అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాశ్​రాజ్​కు మద్దతు ప్రకటించారు నటుడు నాగబాబు. సినిమా జ్ఞానం, ప్రపంచ జ్ఞానం ప్రకాశ్​రాజ్(maa elections prakash raj panel)​ దగ్గర చాలా ఉందని అన్నారు. ఆయనకున్న ప్రత్యేకతలు విష్ణుకు లేవని చెప్పారు.

prakash raj
ప్రకాశ్​రాజ్​

By

Published : Oct 9, 2021, 11:54 AM IST

Updated : Oct 9, 2021, 12:39 PM IST

నాగబాబు

'మా' ఎన్నికల్లో(maa elections 2021 schedule) అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌కు నటుడు, నిర్మాత నాగబాబు మద్దతు ప్రకటించారు(maa elections prakash raj panel). ప్రకాశ్‌రాజ్‌కు ఉన్న ప్రత్యేకతలు విష్ణులో లేవని, విష్ణు తల్లిదండ్రులు మాత్రమే తెలుగు వారని అన్నారు. "దేశ ప్రధానితో పోరాటం చేయగల వ్యక్తి ప్రకాశ్‌రాజ్‌. ఆయనకున్న ప్రత్యేకతలు విష్ణుకు లేవు(maa elections manchu vishnu panel). ప్రకాశ్‌రాజ్‌ను మోహన్‌ బాబుతో పోల్చాలి. కానీ, విష్ణుతో కాదు. విద్యార్థులకు ఏం కావాలో విద్యాసంస్థ నడుపుతున్న మోహన్‌ బాబుకు తెలుసు. నటులకు ఏం కావాలో ఆఫీసుల చుట్టూ తిరిగిన ప్రకాశ్‌రాజ్‌కే తెలుసు. ఆయనకే కాదు మోహన్‌ బాబు కుటుంబానికీ నిర్మాతలతో వివాదాలున్నాయి" అన్నారు.

"విష్ణు తన జీవితంలో పాతిక సినిమాల్లో నటించాడు. ప్రకాశ్‌రాజ్‌(maa elections president list) పాతికేళ్ల నుంచి సంవత్సరానికి పాతిక సినిమాలు చేశారు. నాన్‌ లోకల్‌ అనే ఆలోచన ఉన్నప్పుడు ఆయనకు 'మా' సభ్యత్వం ఎందుకిచ్చారు? ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉంటుంది. మిమ్మల్ని గెలిపించడానికి పనికొచ్చే ప్రకాశ్‌రాజ్‌ తాను గెలవడానికి పనికిరాడా? మంచు విష్ణులాంటి వ్యక్తి గెలిస్తే అసోసియేషన్‌ పరిస్థితి ఏంటి? 'తెలుగు సినిమా మనది' అనుకునేవాడ్ని వేరు చేయడం మానవత్వమేనా? 60ఏళ్ల క్రితం మద్రాసులో ఉన్నప్పుడు మనల్ని నాన్ లోకల్‌ అంటే తెలుగు సినిమా ఇలా ఉండేదా? విష్ణు.. నువ్వు ఎక్కడ పుట్టావ్‌? ఎక్కడ చదువుకున్నావ్‌? మీ అమ్మానాన్నలు మాత్రమే తెలుగు వారు. ప్రకాశ్‌రాజ్‌ను తెలుగు వాడంటారు. విష్ణును తెలుగు నేర్చుకోమంటారు. సినిమా జ్ఞానం, ప్రపంచ జ్ఞానం ఉన్న ప్రకాశ్‌రాజ్‌కే నా మద్దతు" అని నాగబాబు తెలిపారు.

అక్టోబరు 10న 'మా' ఎన్నికలు(maa elections) జరగనున్నాయి. మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు.

ఇదీ చూడండి: Maa Elections 2021: 'మా'లో రాజకీయాలు.. ఈ విషయాలు మీకు తెలుసా?

Last Updated : Oct 9, 2021, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details