నటుడు నాగబాబు కుమార్తె నిహారిక-చైతన్యల వివాహం ఐదురోజులపాటు వేడుకగా జరిగింది. ఉదయ్‌పూర్‌లో అతి తక్కువమంది కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో జరిగిన వీరి వివాహానికి సంబంధించిన కొన్ని వీడియోలను గత కొన్నిరోజులుగా నాగబాబు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఆయన 'నిశ్చయ్' సంగీత్ వీడియోను షేర్ చేశారు. సంగీత్‌లో నిహారిక-చైతన్య, నాగబాబు దంపతులు, రామ్‌చరణ్, బన్నీ వేసిన డ్యాన్స్‌ను ఈ వీడియోలో చూడొచ్చు. అలాగే నిహారికకు డెస్టినేషన్ వెడ్డింగ్ చేయడానికి గల కారణాన్ని కూడా ఆయన ఈ వీడియోలో వెల్లడించారు.
నిశ్చయ్.. డెస్టినేషన్ వెడ్డింగ్ ఎందుకంటే? - నిహారికకు డెస్టినేషన్ వెడ్డింగ్ ఎందుకంటే
నటుడు నాగబాబు కుమార్తె నిహారిక-చైతన్యల వివాహం ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలను కొన్ని రోజులుగా నాగబాబు నెట్టింట షేర్ చేస్తున్నారు. తాజాగా సంగీత్ వేడుకను అభిమానులతో పంచుకున్నారు. అలాగే నిహారికకు డెస్టినేషన్ వెడ్డింగ్ చేయగానికి గల కారణాన్ని వెల్లడించారు.
"నిహారికకు డెస్టినేషన్ వెడ్డింగ్ చేయడానికి చాలా కారణాలున్నాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వేడుకలు తక్కువమందితో మాత్రమే జరగాలనే నిబంధనలు ఉన్నాయి. అందుకే, కేవలం మా కుటుంబసభ్యులు, కొంతమంది స్నేహితులతో ఈ విధంగా ప్లాన్ చేశాం. అదీకాక, మా కుటుంబంలో జరిగిన బన్నీ, చరణ్ వివాహాలను మేము పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయాం. ఎందుకంటే, వివాహానికి కొన్ని వేలమంది హాజరయ్యేవాళ్లు. దానివల్ల, ఏర్పాట్లు చూసుకోవడంలోనే సమయం గడిచిపోయేది. కాబట్టి నిహారికకు డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే బాగుంటుందని అనుకున్నాం. అలాగే, పెళ్లి తర్వాత ఎక్కువమందిని పిలిచి రిసెప్షన్ కూడా ఇస్తాం. చైతన్య-నిహారిక ఇష్ట ప్రకారమే ఈ వెడ్డింగ్ ప్లాన్ చేశాం. ఉయద్‌విలాస్‌కు సంబంధించిన పెళ్లి ఏర్పాట్లు అన్ని వరుణ్ చేశాడు." అని నాగబాబు వెల్లడించారు.