Nagababu: మంచు విష్ణు కార్యాలయంలో దొంగతనానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీనుకు మెగా బ్రదర్ నాగబాబు బాసటగా నిలిచారు. నాగశ్రీను కుటుంబ పరిస్థితిని తెలుసుకొని రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
Nagababu: మెగా బ్రదర్ నాగబాబు ఆర్థిక సాయం - maa latest news
Nagababu: 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీనుకు మెగా బ్రదర్ నాగబాబు ఆర్థిక సాయం అందజేశారు. అలాగే అతని పిల్లలకు వైద్య పరీక్షలు చేయిస్తానని హామీ ఇచ్చారు నాగబాబు.
నాగశ్రీనును, అతడి భార్య పిల్లలను తన కార్యాలయానికి పిలుపించుకొని మాట్లాడాడు. తన తల్లి ఆరోగ్యం బాగాలేదని, గతంలో పనిచేసిన సంస్థ నుంచి సరిగా జీతం అందలేదని నాగశ్రీను ఆవేదన వ్యక్తం చేశాడు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న అతడి కుటుంబానికి నాగబాబు తన వంతు ఆర్థికసాయం చేశారు. దాంతోపాటు అతడి పిల్లలకు అపోలో ఆస్పత్రిలో పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు చేయించనున్నట్లు నాగబాబు వెల్లడించారు. నాగబాబు చేసిన సహాయం పట్ల నాగశ్రీను, అతడి కుటుంబసభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:'సమంతకు దూకుడెక్కువ.. అచ్చం కోహ్లీలానే..'