వరుణ్‌తేజ్ - సాయిపల్లవిల వివాహం గురించి నటుడు నాగబాబు స్పందించారు. ఈ మధ్య కాలంలో సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో ఆయన మమేకం అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన ఇన్‌స్టా చాట్‌లో వరుణ్‌తేజ్ వివాహం గురించి ఓ నెటిజన్ నాగబాబును ప్రశ్నించారు. దానికి ఆయన ఇచ్చిన కౌంటర్ అందర్నీ ఎంతగానో నవ్విస్తోంది.
"వరుణ్‌తేజ్-సాయిపల్లవిల జోడీ చూడచక్కగా ఉంటుంది. కాబట్టి వాళ్లిద్దరికి పెళ్లి చేసేస్తా" అంటూ ఓ నెటిజన్ నాగబాబుకు పోస్ట్ పెట్టాడు. దానిపై స్పందించిన ఆయన 'జాతిరత్నాలు' చిత్రంలో బ్రహ్మానందం చెప్పే.. "తీర్పు కూడా మీరే ఇచ్చుకోండ్రా. అరేయ్ మనమెందుకు ఇక్కడ వెళ్లిపోదాం రండి" అనే వీడియోతో నెటిజన్‌కు కౌంటర్ వేశారు. మరోవైపు, ఇటీవల కాలంలోనే "వరుణ్ అన్నకు పెళ్లి ఎప్పుడు చేస్తారు?" అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. "మంచి సంబంధాలు ఉంటే చూడండి" అని నాగబాబు సమాధానమిచ్చారు.