మెగా డాటర్ నిహారిక, ఆమె భర్త చైతన్యకు కరోనా సోకిందనే కథనాలకు చెక్ పెట్టారు నాగబాబు. వారికి కొవిడ్ లేదని స్పష్టం చేశారు. ఇటీవలే పెళ్లి చేసుకున్న వారిద్దరూ మాల్దీవులకు వెళ్లి వచ్చారు.
"డిసెంబర్ 26న మాల్దీవులకు వెళ్లే ముందు, తిరిగొచ్చాక డిసెంబర్ 29న ముంబయి విమానాశ్రయంలో ప్రభుత్వ నియమాల ప్రకారం నిహారిక, చైతన్య కొవిడ్ పరీక్షలు చేసుకున్నారు. రెండింటిలోనూ కరోనా నెగిటివ్గా తేలింది."