'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచమయ్యాడు నాగశౌర్య. ఆ సినిమాతో ప్రేమ కథలకు చిరునామాగా మారాడు. ఇటీవలే 'ఓ బేబీ' చిత్రంలో కీలక పాత్ర పోషించి మెప్పించాడు. ప్రస్తుతం 'అశ్వత్థామ' చిత్రంతో బిజీగా ఉన్నాడు శౌర్య. అది విడుదలకు ముందే మరో సినిమాను మొదలు పెట్టేశాడు.
నూతన దర్శకురాలితో నాగశౌర్య చిత్రం
టాలీవుడ్ హీరో నాగశౌర్య హీరోగా కొత్త చిత్రాన్ని ప్రకటించింది నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుందీ సినిమా.
నాగశౌర్య
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకురాలు లక్ష్మీ సౌజన్య తెరకెక్కిస్తోంది. రెగ్యులర్ షూటింగ్ అక్టోబరు నుంచి ప్రారంభంకానుంది. 2020 మేలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
ఇవీ చూడండి.. నాని నిర్మాణంలో విశ్వక్ సేన్...!
Last Updated : Oct 1, 2019, 5:07 AM IST