Naga shourya new movie: యువహీరో నాగశౌర్య కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. 'కృష్ణ వ్రింద విహారి' అనే టైటిల్ పెట్టడం సహా సంప్రదాయంగా ఉన్న శౌర్య ఫస్ట్‌లుక్‌ను కూడా రిలీజ్ చేశారు.
'అలా ఎలా', 'లవర్' సినిమాలతో ఆకట్టుకున్న అనీష్.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా ఫిల్మ్స్ నిర్మిస్తుంది. షెర్లి శెటియా హీరోయిన్గా నటిస్తోంది. మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నారు.
Naga chaitanya thank you movie: 'బంగార్రాజు' సినిమాతో సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టిన నాగచైతన్య.. ఇప్పుడు 'థాంక్యూ' సినిమా చివరిదశ చిత్రీకరణలో పాల్గొంటున్నారు.
రొమాంటిక్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు.