తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కుటుంబకథా చిత్రంతో నాగశౌర్య - నాగశౌర్య కొత్త చిత్రం

యువ కథానాయకుడు నాగశౌర్య సినిమాల ఎంపికలో జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికే రెండు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న ఇతడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

vNaga Shourya new movie announced
నాగశౌర్య మరో చిత్రం ఖరారైంది

By

Published : Oct 16, 2020, 2:04 PM IST

యువ కథానాయకుడు నాగశౌర్య జోరు పెంచాడు. వెంటవెంటనే సినిమాలు ప్రకటిస్తూ ఆసక్తి పెంచేస్తున్నాడు. ప్రస్తుతం విలువిద్య నేపథ్యంలో సాగే ఓ కథని పట్టాలెక్కిస్తున్నాడు. 'ఎన్‌ఎస్‌ 20' వర్కింగ్‌ టైటితో సంతోష్‌ జాగర్లపూడి తెరకెక్కిస్తున్నాడు. లక్ష్మీ సౌజన్య అనే నూతన దర్శకురాలితో మరో చిత్రం చేస్తున్నాడు. ఇదొక అందమైన ప్రేమ కథ. తాజాగా మరో చిత్రాన్ని ప్రకటించాడు.

కుటుంబ కథా నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 'అలా ఎలా', 'లవర్‌' చిత్రాల దర్శకుడు అనీష్‌ కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. మహతి సాగర్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడించనుంది చిత్రబృందం.

ABOUT THE AUTHOR

...view details