సినిమాల్లో పాత్రకు తగ్గట్లు తమ దేహాన్ని మార్చుకునేందుకు హీరోలు భారీ కసరత్తులు చేస్తుంటారు. అందుకుతగ్గట్లుగానే డైట్ పాటిస్తుంటారు. యువకథానాయకుడు నాగశౌర్య కూడా ఇలానే కొత్త సినిమా కోసం ఎయిట్ప్యాక్ సాధించారు. ఇందుకోసం లాక్డౌన్లో కచ్చితమైన డైట్ పాటిస్తూ, రోజూ జిమ్‌లో చెమటలు చిందించారు. అయితే దీనికి సంబంధించిన ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకొచ్చింది.
తన శరీరాన్ని సరైన ఆకారంలోకి తీసుకొచ్చే క్రమంలో దాదాపు ఐదు రోజులపాటు నీళ్లు తాగలేదట. కనీసం లాలాజలాన్ని కూడా మింగలేదని చెప్పినట్లు తెలుస్తోంది.