తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సంక్రాంతి కోడి పందేలకు నాగశౌర్య దూరం..!

టాలీవుడ్​ యువ కథానాయకుడు నాగశౌర్య నటిస్తోన్న చిత్రం 'అశ్వథ్థామ'. ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్​డేట్​ను ప్రకటించింది చిత్రబృందం. సంక్రాంతి కోడి పందేల నేపథ్యంలో చిన్న వీడియోను రూపొందించి విడుదల చేసింది.

Naga Shaurya Turns Ashwathama and His Movie not in a Race of Pongal 2020
సంక్రాంతి కోడి పందాలకు నాగశౌర్య దూరం..!

By

Published : Jan 9, 2020, 4:19 PM IST

సంక్రాంతి పండగకు కోడి పందేలు ప్రత్యేక ఆకర్షణ. ప్రతి సంవత్సరం గ్రామాల్లో ఈ పోటీలు హుషారుగా జరుగుతాయి. అయితే ఈ ఏడాది మాత్రం బాక్సాఫీస్​ వద్ద జరగనున్న కోడిపందేల్లో అగ్రహీరోల చిత్రాలు పోటీపడుతున్నాయి. ఫలితంగా బాక్సాఫీస్​ వద్ద గెలిచేదెవరనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఈరోజు (జనవరి 9) 'దర్బార్'​ విడుదల కాగా.. 11న 'సరిలేరు నీకెవ్వరు', 12న 'అల వైకుంఠపురములో' ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. జనవరి 15న 'ఎంత మంచివాడవురా' విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్​ యువ కథానాయకుడు నాగశౌర్య మాత్రం 'కొన్నిసార్లు బరిలో ఉండటం కంటే బయటే ఉండడం బెటర్'​ అని అంటున్నాడు. అతడు కథానాయకుడిగా నటించిన చిత్రం 'అశ్వథ్థామ'. రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మెహరీన్​ కథానాయిక.
సంక్రాంతి బరిలో లేకుండా భారీ సినిమాలకు దారిచ్చిన నాగశౌర్య.. తన సినిమా జనవరి 31న విడుదల కానుందని వెల్లడించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ 'అశ్వథ్థామ సంక్రాంతి కోడిపందేలు' పేరుతో ఓ స్పెషల్​ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.

ఈ సినిమాకు నాగశౌర్యనే కథ అందించాడు. శ్రీ చరణ్​ పాకాల బాణీలు సమకూర్చాడు. ఐరా క్రియేషన్స్​ పతాకంపై నాగశౌర్య తల్లి ఉషా ముల్పూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సంక్రాంతి కోడి పందాలకు నాగశౌర్య దూరం..!

ABOUT THE AUTHOR

...view details