తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఫిదా 2.0కు లైన్​ క్లియర్... వచ్చే నెల నుంచి షూటింగ్ - సాయి పల్లవి

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా.. వచ్చే నెల 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇందులో తెలంగాణ కుర్రాడిగా కనిపించనున్నాడు అక్కినేని హీరో.

నాగ చైతన్య, సాయి పల్లవి, శేఖర్​ కమ్ముల

By

Published : Aug 26, 2019, 3:56 PM IST

Updated : Sep 28, 2019, 8:13 AM IST

యువసామ్రాట్​ అక్కినేని నాగచైతన్య, 'ఫిదా' భామ సాయిపల్లవి కాంబినేషన్​లో ఓ ప్రేమకథ తెరకెక్కుతోంది. అయితే పూజా కార్యక్రమం ఎప్పుడో జరిగినా, షూటింగ్ ఇప్పటికీ మొదలుకాలేదు. ముందుగా ఆగస్టు 25న ప్రారంభించాలని అనుకున్నా వాయిదా పడింది. అయితే వచ్చే నెల 5 నుంచి రెగ్యులర్​ చిత్రీకరణ షురూ చేయనున్నారని సమాచారం.

ఇందులో నాగచైతన్య పూర్తిస్థాయి తెలంగాణ యాసతో మాట్లాడనున్నాడు. అందుకోసం ప్రత్యేక తరగతులకు వెళ్తున్నాడట. టైటిల్​ ఖరారు కాని ఈ చిత్రానికి శేఖర్​ కమ్ముల దర్శకత్వం వహించనున్నాడు. నారాయణదాస్ నారంగ్, రామ్​మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నాగచైతన్య 'వెంకీమామ' చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఇందులో వెంకటేశ్ మరో హీరోగా కనిపించనున్నాడు. పాయల్ రాజ్​పుత్, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాబీ దర్శకుడు.

ఇదీ చూడండి: రొమాంటిక్​ మూడ్​లో 'సాహో' జోడి

Last Updated : Sep 28, 2019, 8:13 AM IST

ABOUT THE AUTHOR

...view details