తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చైతూ తర్వాత చిత్రం ఆ దర్శకుడితోనే? - తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో నాగచైతన్య

అక్కినేని యువ హీరో నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్​తో 'థ్యాంక్యూ' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్​తో ఓ మూవీ చేయబోతున్నాడట చైతూ.

Naga Chaitanya
నాగ చైతన్య

By

Published : Mar 10, 2021, 9:56 AM IST

ఇప్పటివరకు లవర్‌బాయ్‌గా ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న అక్కినేని హీరో నాగచైతన్య ఈసారి రూటు మార్చనున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి చిత్రవర్గాలు. చైతూ హీరోగా నటించిన 'లవ్‌స్టోరీ' చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం విక్రమ్ కుమార్​తో 'థ్యాంక్యూ' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్​తో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట చైతూ.

ఈ సినిమాలో నాగ చైతన్యను పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా చూపించబోతున్నాడట తరుణ్ భాస్కర్. కథ నచ్చడం వల్ల చైతూ వెంటనే ఓకే చెప్పినట్లు చిత్రవర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం.. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'లవ్‌స్టోరీ' విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 16న ఈ మూవీ విడుదల కానుంది. ఈ చిత్రాన్ని శేఖర్‌ కమ్ముల తెరకెక్కించాడు. శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. యువ సంగీత దర్శకుడు పవన్‌ స్వరాలు సమకూర్చాడు.

ABOUT THE AUTHOR

...view details