అక్కినేని వారసుడు.. కథానాయకుడు నాగచైతన్య బాలీవుడ్‌లో తొలి అడుగు వేయబోతున్నారా? ఆమిర్ ఖాన్ సినిమాతో ఉత్తరాది ప్రేక్షకుల్ని పలకరించనున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం ఆమిర్ కథానాయకుడిగా 'లాల్ సింగ్ చద్దా' చిత్రం తెరకెక్కుతోంది. హాలీవుడ్‌లో విజయవంతమైన 'ఫారెస్ట్ గంప్' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోంది. ఇప్పుడీ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నాగచైతన్యను సంప్రదించారని సమాచారం.
అక్కినేని వారసుడికి బాలీవుడ్ నుంచి పిలుపు! - ఆమిర్ ఖాన్
అక్కినేని వారసుడు హిందీ చిత్రసీమలో అడుగుపెట్టనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఆమిర్‌ఖాన్ నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా' చిత్రంలో ఓ కీలకపాత్ర కోసం చైతూ ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
అక్కినేని వారసుడికి బాలీవుడ్ నుంచి పిలుపు!
తొలుత ఈ పాత్ర కోసం విజయ్ సేతుపతిని అనుకోగా.. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు తెలిసింది. దీంతో ఇప్పుడీ పాత్ర కోసమే చిత్ర నిర్మాతలు చైతన్యను సంప్రదించారని సమాచారం. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని.. ఇందులో నటించేందుకు చైతూ ఆసక్తిగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదీ చూడండి:'మా ప్రేమ పెళ్లి.. ఓ సినిమా కథ అవుతుంది'
Last Updated : Mar 17, 2021, 9:28 AM IST