తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సామ్​ బాటలో నాగచైతన్య.. బాలీవుడ్​ ఎంట్రీ! - లాల్​సింగ్​ చద్దాలో నాగచైతన్య

అక్కినేని వారసుడు హీరో నాగచైతన్య బాలీవుడ్​లో అడుగుపెట్టనున్నారని సమాచారం. స్టార్​ కథానాయకుడు ఆమిర్​ఖాన్​ నటిస్తున్న 'లాల్​సింగ్ చద్దా' సినిమాలో చైతన్య ఓ కీలకపాత్ర కోసం ఎంపికైయ్యారని ప్రచారం జరుగుతోంది.

Naga Chaitanya to make his Bollywood debut with Aamir Khan's Laal Singh Chaddha?
సామ్​ బాటలో నాగచైతన్య.. బాలీవుడ్​లో ఎంట్రీ!

By

Published : Jan 25, 2021, 5:21 PM IST

కెరీర్‌ విషయంలో హీరో నాగచైతన్య.. తన సతీమణి సమంతను అనుసరిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా రాణిస్తున్న సామ్‌.. 'ది ఫ్యామిలీ మ్యాన్‌-2' సిరీస్‌తో ఇటీవల బాలీవుడ్‌లోకి​ ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే టాలీవుడ్​లో వరుస ప్రేమకథా చిత్రాలతో రాణిస్తున్న చైతన్య.. త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.

ఆమిర్‌ఖాన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'లాల్‌సింగ్‌ చద్దా'. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమాలో నాగచైతన్య ఓ కీలకపాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే చిత్రబృందం చైతన్యను సంప్రదించారని సమాచారం. అయితే, ఈ వార్తలపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు చైతన్య ప్రస్తుతం 'థ్యాంక్యూ'లో నటిస్తున్నారు. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదీ చూడండి:బిగ్​బాస్​ ఫేమ్​ నటి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details