అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా 'థ్యాంక్యూ'. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విడుదలపై గత కొన్నిరోజుల నుంచి పలు వార్తలు వైరల్గా మారాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్ఫామ్ వేదికగా విడుదల చేయనున్నారని అందరూ చెప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ చిత్రబృందం బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ చిత్రాన్ని థియేటర్లోనే విడుదల చేయనున్నామని తెలిపింది.
"థ్యాంక్యూ సినిమా నిర్మాణం చివరి దశలో ఉంది. వెండితెరపైనే మా చిత్రాన్ని చూపించాలని అంకితభావంతో దీన్ని నిర్మిస్తున్నాం. సరైన సమయంలో థ్యాంక్యూ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తాం" అని చిత్రబృందం ఓ ఫొటో పోస్ట్ చేసింది.