టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్‌లో ఒకరిగా పేరు సంపాదించుకుంది నాగచైతన్య-సమంత జంట. తాజాగా రానా-మిహీక పెళ్లిలో వీరి జంట కనువిందు చేసింది. వారి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
చూడముచ్చటగా చైతూ-సామ్ ఫొటో - Naga Chaitanya-Samantha news
టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగ చైతన్య-సమంత జంట రానా-మిహీకల పెళ్లిలో సందడి చేసింది. తాజాాగా వీరికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
చూడముచ్చటగా చైతూ-సామ్ ఫొటో
ఇందులో ఓ ఫొటోలో చైతూ-సామ్ జంట చూడముచ్చటగా ఉంది. చై, సామ్‌ను టీజ్ చేస్తున్నట్లు కనిపించాడు. దీనికి నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. లవ్లీ కపుల్ అంటూ మెచ్చుకుంటున్నారు.
అలాగే వేరొక ఫొటోలు దగ్గుబాటి ఫ్యామిలీ కనువిందు చేసింది. వెంకటేశ్, సురేశ్ బాబు కూడా ఇందులో కనిపించారు.
Last Updated : Aug 10, 2020, 6:18 PM IST