తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చై-సామ్.. నిజ జీవిత పాత్రల్లో మరోసారి? - తెలుగు సినిమా వార్తలు

నాగార్జున నటించబోయే 'సోగ్గాడే చిన్నినాయన' సీక్వెల్​లో చైతన్య-సమంత జంటగా నటించనున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

చై-సామ్
నాగచైతన్య-సమంత

By

Published : Nov 26, 2019, 7:34 PM IST

టాలీవుడ్​ జోడీ నాగచైతన్య-సమంత మరోసారి భార్య భర్తలుగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఇంతకీ ఆ సినిమా పేరేంటి? దర్శకుడు ఎవరు? తదితర ప్రశ్నలు అభిమానుల మససు తొలిచేస్తున్నాయి.

ఇంతకీ విషయమేమిటంటే?

కింగ్ నాగార్జున.. తన తర్వాతి చిత్రంగా 'సోగ్గాడే చిన్నినాయన' సీక్వెల్ చేయనున్నాడు. మొదటి భాగాన్ని తీసిన కల్యాణ్​కృష్ణే దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలోని మరో ముఖ్య పాత్రలో నాగచైతన్య నటించనున్నాడట. అంతేకాకుండా చైతూ భార్య పాత్ర కీలకమని, అందుకోసం సమంతను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నాడట ఈ డైరక్టర్. ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని, సామ్‌ పచ్చజండా ఊపే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

మజిలీ సినిమాలో నాగచైతన్య-సమంత

పెళ్లికి ముందు పలు సినిమాల్లో జంటగా నటించిన చై-సామ్.. వివాహం తర్వాత 'మజిలీ' అనే చిత్రంలో జంటగా నటించి, మెప్పించారు. ఇప్పుడు ఈ సినిమా కోసం సిద్ధమవుతున్నారు.

ఇది చదవండి: ఆ సీన్లు చేయడం చైతూకు కష్టమే: సమంత

ABOUT THE AUTHOR

...view details