విభిన్న చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల ఇటీవలే తన కొత్త సినిమాను ప్రారంభించాడు. నాగచైతన్య హీరోగా నటిస్తుండగా, 'ఫిదా' బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్. వీరిద్దరూ తొలిసారి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
క్రిస్మస్కు వస్తున్న నాగ చైతన్య- సాయి పల్లవి
'ఫిదా'తో ఆకట్టుకున్న సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్యతో నటిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను క్రిస్మస్కు విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
క్రిస్మస్కు వస్తున్న నాగచైతన్య-సాయిపల్లవి
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోందీ సినిమా. సెప్టెంబరులో షూటింగ్ మొదలు కానుంది. కేవలం 60 రోజుల్లోనే అంతా పూర్తి చేసుకుని క్రిస్మస్కు ప్రేక్షకుల ముందుకు తేవాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇతర నటీనటులు ఎవరనేది త్వరలో వెల్లడిస్తారు.
ఇది చదవండి: తెలంగాణ పిల్లగాడిగా అక్కినేని హీరో!
Last Updated : Jul 13, 2019, 6:52 AM IST