ఇప్పటివరకు లవర్‌బాయ్‌గా ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న అక్కినేని హీరో నాగచైతన్య ఈసారి రూటు మార్చనున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి చిత్రవర్గాలు. చైతూ హీరోగా నటించిన 'లవ్‌స్టోరీ' చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కాగా.. ఈ యువ హీరో 'పెళ్లి చూపులు' దర్శకుడు తరుణ్‌భాస్కర్‌తో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు డైరెక్టర్ తరుణ్ ఒక కథను చైతూకి వినిపించాడట. అందులో హీరో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడట. కథ నచ్చడం వల్ల చైతూ వెంటనే ఓకే చెప్పినట్లు చిత్రవర్గాల సమాచారం.
పవర్ ఫుల్ పాత్రలో నాగ చైతన్య!
అక్కినేని హీరో నాగ చైతన్య తన కొత్త చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడట. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.
రూటు మార్చిన నాగ చైతన్య!
ప్రస్తుతం.. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'లవ్‌స్టోరీ' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. యువ సంగీత దర్శకుడు పవన్ స్వరాలు సమకూర్చారు.