'లవ్‌స్టోరీ' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు అక్కినేని హీరో నాగచైతన్య. అతడి కోసం ఇప్పటికే పలు కథలు సిద్ధమయ్యాయి. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' చేయబోతున్నాడు. మోహనకృష్ణ ఇంద్రగంటి చైతూ కోసం ఒక కథని సిద్ధం చేశాడు.
యువ దర్శకుడితో నాగ చైతన్య కొత్త చిత్రం! - వెంకీ అట్లూరీ తాజా వార్తలు
అక్కినేని నాగచైతన్య సినిమాల ఎంపికలో జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్‌స్టోరీ' చేస్తుండగా, విక్రమ్ కుమార్‌తో 'థ్యాంక్యూ' చిత్రాన్ని త్వరలోనే పట్టాలెక్కించనున్నాడు. అయితే తాజాగా మరో యువ దర్శకుడు చైతూకి కథ వినిపించినట్లు సమాచారం.
యువ దర్శకుడితో నాగ చైతన్య కొత్త చిత్రం!
అయితే స్పోర్ట్స్ డ్రామాతో కూడిన మరో కథని యువ దర్శకుడు వెంకీ అట్లూరి సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అది చైతూ కోసమే అని, అతడు ఇప్పటికే ఆ కథా నేపథ్యాన్ని విన్నాడని తెలిసింది. వెంకీ అట్లూరి ప్రస్తుతం 'రంగ్‌దే' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరి ఆ కలయికలో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.