తెలంగాణ

telangana

ETV Bharat / sitara

షూటింగ్ షురూ చేసిన తెలంగాణ కుర్రాడు - సాయిపల్లవి

హీరో నాగచైతన్య.. తెలంగాణ కుర్రాడిగా కనిపించనున్న సినిమా షూటింగ్ ప్రారంభమైంది. శేఖర్​ కమ్ముల దర్శకుడు. క్రిస్మస్​కు విడుదల కానుందని సమాచారం.

షూటింగ్ షురూ చేసిన తెలంగాణ కుర్రాడు

By

Published : Sep 9, 2019, 2:42 PM IST

Updated : Sep 29, 2019, 11:53 PM IST

యువసామ్రాట్​ నాగచైతన్య కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించాడు. హైదరాబాద్​లో​ సోమవారం లాంఛనంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి చిత్రబృందం అంతా హాజరైంది. హీరోయిన్​గా 'ఫిదా' ఫేమ్ సాయిపల్లవి నటిస్తోంది. ఇందులో తెలంగాణ యాసలో మాట్లాడి అలరించేందుకు సిద్ధమవుతున్నాడు అక్కినేని హీరో.​

క్లాస్​ చిత్రాలను తెరకెక్కించే శేఖర్​ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. నారాయణదాస్​ నారంగ్, రామ్మోహనరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్​కు ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: 'ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలే సామ్​కు ఇష్టం'

దర్శకుడు శేఖర్​కమ్ములకు స్క్రిప్ట్​ అందజేస్తున్న నిర్మాత నారాయణదాస్ నారంగ్
చిత్రబృందం గ్రూప్ ఫొటో
కెమెరా స్విచ్​ఆన్ చేస్తూ
Last Updated : Sep 29, 2019, 11:53 PM IST

ABOUT THE AUTHOR

...view details