Naga chaitanya vikram kumar: ఇటీవల 'లవ్‌స్టోరీ'తో హిట్ కొట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో నాగచైతన్య గురించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న చైతూ.. ఇప్పుడు జర్నలిస్టు గెటప్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌లో చైతూ ప్రధాన పోషిస్తున్నారు.
'మనం' చిత్రంతో హిట్ కొట్టిన నాగచైతన్య-విక్రమ్ కె. కుమార్‌లు ఇటీవల 'థాంక్యూ' చిత్రానికి కూడా కలిసి పనిచేశారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి వీరు కలిసి పనిచేయడంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జర్నలిస్ట్ పాత్రలో నాగచైతన్య నటించడం ఇదే తొలిసారి.