తెలంగాణ

telangana

ETV Bharat / sitara

యాక్షన్ థ్రిల్లర్​ వెబ్​ సిరీస్​లో నాగచైతన్య! - నాగచైతన్య థాంక్యూ మూవీ

అక్కినేని కథానాయకుడు నాగచైతన్య.. తొలిసారి వెబ్​సిరీస్​తో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. అమెజాన్​ ప్రైమ్​ దీనిని నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

Naga Chaitanya  web project for Amazon Prime Video
నాగచైతన్య

By

Published : May 6, 2021, 5:30 AM IST

ఇప్పటివరకు వెండితెరపై అలరిస్తూ వచ్చిన నాగచైతన్య.. ఇప్పుడు డిజిటల్​ మాధ్యమాల్లోనూ మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. చైతూ, అమెజాన్​ ప్రైమ్​లో యాక్షన్ థ్రిల్లర్​ వెబ్​ సిరీస్​ చేయనున్నారని సమాచారం. జులైలో దీని షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం నాగచైతన్యతో 'థాంక్యూ' తీస్తున్న విక్రమ్ కె కుమార్.. ఈ వెబ్ సిరీస్​కు దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇందులో చైతూతో పాటు రాధిక ఆప్టే, అతుల్ కులకర్ణి లాంటి పాన్ ఇండియా యాక్టర్స్ నటిస్తారని టాక్.

చైతూ భార్య సమంత.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్​తో ఇప్పటికే డిజిటల్​ అరంగేట్రం చేసేసింది. కానీ అది విడుదల కావాల్సి ఉంది.

నాగచైతన్య

ABOUT THE AUTHOR

...view details