Naga Chaitanya on Samantha: నాగచైతన్య- సమంత విడిపోయి రెండు నెలలు అవుతున్నా.. ఏదో ఒక సందర్భంలో ఇప్పటికీ వారి గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది. వ్యక్తిగత విషయాలను పబ్లిక్‌లో మాట్లాడానికి ఇష్టపడని చైతన్య ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
"ఏ పాత్రలు చేయడానికి మీరు ఇష్టపడరు?" అన్న ప్రశ్నకు చైతూ బదులిస్తూ.. "నేను ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే. అయితే అది వ్యక్తిగతంగా, కుటుంబం గౌరవానికి భంగం కలిగేలా ఉండకూడదు. అలాంటి పాత్ర, కథ నా దగ్గరికి వస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను" అన్నాడు.
ఈ వ్యాఖ్యలు సమంతను ఉద్దేశించి పరోక్షంగా చేసినవేనంటూ నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా, అల్లు అర్జున్ నటించిన 'పుష్ప'లో ఓ ప్రత్యేక గీతంలో నటించింది సమంత. అందులో సామ్ హాట్లుక్స్కు అభిమానులు ఫిదాఅవుతున్నారు.