నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందనే విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్ డేట్ రేపు (శుక్రవారం) ప్రకటించనున్నారు. "రేపు ఉదయం 10 గంటలకు పెద్ద ప్రకటన ఉంది" అంటూ వైజయంతీ మూవీస్ సంస్థ ట్వీట్ చేసింది. దీంతో ఆ ప్రకటన ఏమై ఉంటుందా? అని అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా నుంచి బిగ్ అప్డేట్ - nag aswin prabhas movie update
నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబోలో రానున్న సినిమాకు సంబంధించి రేపు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు బిగ్ అప్డేట్ రాబోతుంది. ఈ మేరకు చిత్రనిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది.
ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా నుంచి కొత్త అప్డేట్
ఈ చిత్రంలో స్టార్ నటుడిని విలన్గా ఎంపిక చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి నాగ్ అశ్విన్.. అభిమానులు, ప్రేక్షకులకు ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తాడో వేచి చూడాలి.