రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్(Janhvi Kapoor) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'రూహీ'(Roohi). హార్దిక్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాను జియో స్టూడియోస్, మడోక్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ ఏడాది మార్చి 11న విడుదలై ఆకట్టుకుందీ మూవీ. హారర్, కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో జాన్వీ నటన ప్రధాన ఆకర్షణ.
Roohi: అలరిస్తోన్న జాన్వీ 'నదియోం పార్' - నాదియార్ పార్ ఫుల్ సాంగ్
రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్(Janhvi Kapoor) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'రూహీ'(Roohi). మార్చి 11 విడుదలైన ఈ సినిమా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీలోని 'నదియోం పార్' అనే ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు.
జాన్వీ కపూర్
తాజాగా ఈ చిత్రంలోని 'నదియోం పార్' (Nadiyon Paar full song) అనే ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో వచ్చేసింది. ఈ పాటకి ఐపీ సింగ్, జిగర్ సారయ్యలు సాహిత్యం అందించగా షమూర్, రష్మీత్ కౌర్, ఐపి సింగ్, సచిన్- జిగర్ ఆలపించారు.
ఈ చిత్రంలో వరుణ్ శర్మ, మానవ్ విజ్, సరితా జోషి, సుమిత్ గులాటీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దినేష్ విజన్, మృఘ్‌దీప్ సింగ్ లంబా నిర్మాతలు. సచిన్-జిగర్ సంగీతం అందించారు
Last Updated : Jun 3, 2021, 7:46 AM IST