ఇటీవల విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్' బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శనివారం చేసిన సందడి అంతా ఇంతా కాదు. చిత్రబృందంతో కలిసి షాంపైన్ తాగుతూ, డ్యాన్స్ చేస్తూ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.
ఈ చిత్రంలో నటనతో ఆకట్టుకున్న నభా నటేశ్ను హీరోయిన్ ఇలియానాతో పోల్చుతూ ఆమెతో ఉన్న ఫొటోను ట్వీట్ చేశాడు ఆర్జీవీ. దర్శకుడు పూరీ జగన్నాథ్ గతంలో తెరకెక్కించిన 'పోకిరి'లో హీరోయిన్గా ఇలియానా గుర్తింపు తెచ్చుకుంది.