తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అల్లుడు శీనుతో 'ఇస్మార్ట్ భామ' రొమాన్స్​..! - నభా నటేష్ హీరోయిన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ఈ చిత్రంలో హీరోయిన్​గా నభా నటేష్​ను​ తీసుకోనున్నట్లు సమాచారం.

nabha natesh will act in a bellamkonda srinivas movie
అల్లుడు శీను పక్కన ఇస్మార్ట్ భామ..!

By

Published : Nov 28, 2019, 6:58 PM IST

అల్లుడు శీను ఫేమ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పక్కన ఇస్మార్ట్ శంకర్ భామ నభా నటేష్ నటిస్తుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ వర్గాలు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో... హీరోయిన్​గా నభానే తీసుకోవాలనుకుంటోందట చిత్రబృందం.

ఈ శుక్రవారం లాంఛనంగా ప్రారంభం కానున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంతవరకు ప్రకటించలేదు. అయితే ఇస్మార్ట్ శంకర్​తో యువతలో క్రేజ్ తెచ్చుకున్న నభా నటేష్​ను సంప్రందించినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా కోసం ఇప్పటికే గడ్డంతో పాటు సిక్స్​ప్యాక్ కూడా పెంచేశాడు ఈ యువ హీరో. యాక్షన్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో... అందాల భామతో భారీగానే రొమాన్స్​ చేయనున్నాడట అల్లుడు శీను.

నభా.. ఇప్పటికే రవితేజతో 'డిస్కోరాజా', సాయిధరమ్‌ తేజ్‌తో 'సోలో బ్రతుకే సో బెటర్‌' చిత్రాలతో బిజీగా ఉంది. మరోవైపు వరుణ్‌ తేజ్‌ సరసన ఓ చిత్రంలో నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఇదీ చదవండి: రూలర్ షూటింగ్ పూర్తి... 20 నుంచి 'రూలింగ్​'

ABOUT THE AUTHOR

...view details