దర్శకధీరుడు రాజమౌళి(naatu naatu rrr) ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుందీ చిత్రం. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మూవీలోని 'నాటు నాటు' అనే మరో సాంగ్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం(Rajamouli RRR movie). తాజాగా ఈ పాట ప్రోమోను రిలీజ్ చేసింది. దీన్ని చూస్తుంటే ఈ గీతంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ అదిరిపోయే స్టెప్పులు వేసినట్లు తెలుస్తోంది.
RRR movie: 'నాటు నాటు' సాంగ్ ప్రోమో వచ్చేసింది - నాటు నాటు సాంగ్
'ఆర్ఆర్ఆర్'(naatu naatu rrr) సినిమా నుంచి 'నాటు నాటు' సాంగ్ ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమో పాటపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది.
ఈ చిత్రాన్ని దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో (RRR Budget) రూపొందిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli RRR Movie Budget) తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్(Ramcharan RRR New Look ), కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ (Ntr RRR Poster) నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఆలియాభట్, ఒలీవియా మోరీస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ఇదీ చూడండి: RRR movie: ఆకట్టుకుంటున్న 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్