తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నాంది రిలీజ్ డేట్ ఖరారు.. నవ్విస్తోన్న నిన్నిలా నిన్నిలా - Ninnila NInnila release date

అల్లరి నరేశ్ హీరోగా రూపొందిన 'నాంది' రిలీజ్ డేట్ తెలిసిపోయింది. అలాగే 'నిన్నిలా నిన్నిలా' ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది.

Naandhi release date and Ninnila Ninnila trailer released
నాంది రిలీజ్ డేట్ ఖరారు.. నవ్విస్తోన్న నిన్నిలా నిన్నిలా

By

Published : Feb 5, 2021, 11:50 AM IST

అశోక్ సెల్వ‌న్‌, నిత్యా మేన‌న్‌, రీతూ వ‌ర్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'నిన్నిలా నిన్నిలా'. బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అని.ఐ.వి.శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేశారు. ఆద్యంతం నవ్విస్తున్న ప్రచారం చిత్రం సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఈ సినిమా ఫిబ్రవరి 26న జీప్లెక్స్ ఓటీటీ వేదికగా విడుదలవనుంది.

అల్లరి నరేశ్ కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం 'నాంది'. విజయ్‌ కనకమేడల దర్శకుడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.

నాంది

ABOUT THE AUTHOR

...view details