తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నరేశ్ 'నాంది'లో కీలక పాత్రలు ఇవే - అల్లరి నరేశ్ నాంది సినిమా

అల్లరి నరేశ్​ హీరోగా నటిస్తోన్న చిత్రం 'నాంది'. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని పాత్రల లుక్స్​ విడుదల చేసింది చిత్రబృందం.

Naandhi Movie characters revealed
నరేష్ 'నాంది'లో కీలక పాత్రలు ఇవే

By

Published : Jun 29, 2020, 11:08 AM IST

అల్లరి నరేశ్ కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం 'నాంది'. విజయ్‌ కనకమేడల దర్శకుడు. ఇటీవల సినిమా ప్రచార చిత్రాన్ని చిత్రబృందం విడుదల చేసింది. దీనిలో ఎప్పుడూ చూడని విధంగా జైల్లో నగ్నంగా కూర్చొని, ఆందోళనగా కనిపిస్తున్నారు నరేశ్. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న నటీనటులను పరిచయం చేశారు.

వరలక్ష్మి శరత్‌కుమార్‌ లాయర్‌ ఆద్య పాత్రలో నటిస్తుండగా, రాధా ప్రకాశ్‌గా ప్రియదర్శి, కిషోర్‌ అనే పోలీస్‌ పాత్రలో హరీశ్‌ ఉత్తమన్‌, సంతోష్‌గా నటుడు ప్రవీణ్‌ కనిపించనున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్

ఈ చిత్రం లాక్‌డౌన్‌ కంటే ముందే ఎనభై శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. అల్లరి నరేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా జూన్‌ 30న సినిమాలోని చిన్న గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ప్రవీణ్
హరీశ్
ప్రియదర్శి

ABOUT THE AUTHOR

...view details